కోల్‌కతా వైద్యురాలిపై హత్యాచారం తర్వాత గూగుల్‌లో వారం రోజులుగా దారుణమైన వెతుకులాట!
- ఆర్జీ కర్ ఆసుపత్రి ట్రైనీ డాక్టర్‌పై ఈ నెల 9న హత్యాచారం
- విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే గూగుల్ సెర్చ్‌లో మునిగిన నెటిజన్లు
- ఆమె పేరు, ఫొటోలు, వీడియో కోసం వెతుకులాట
- వారం రోజులుగా ఇదే వరుస
గూగుల్ సెర్చ్‌లో మరో దారుణం
వైద్యురాలిపై హత్యాచారం తర్వాత కొందరు మరో దారుణానికి తెగబడ్డారు. గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కోల్‌కతా ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే కొందరు గూగుల్‌లో దూరిపోయి బాధితురాలి ఫొటోలు, అత్యాచార వీడియోల కోసం తెగ వెతికారు. అక్కడితో ఆగకుండా ఆమె పేరు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ‘వీడియో’, ‘రేప్ వీడియో’ అంటూ ఉత్సాహంగా వెతికారు. అంతేకాదు, ‘రేప్ పోర్న్’ అని గాలించారు. గత వారం రోజులుగా ఇంటర్నెట్లో ఇదే వెతుకులాట కొనసాగుతోంది.