ఏపీపీఎస్‌సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా
- ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా
- సెప్టెంబర్ 2 నుండి 9 వరకూ జరగాల్సిన షెడ్యూల్ వాయిదా
- సవరించిన షెడ్యూల్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించిన ఏపీపీఎస్‌సీ
ఏపీలో మొత్తం 81 గ్రూపు 1 పోస్టుల భర్తీకి గానూ మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ పరీక్షలకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 4,496 మంది మెయిన్స్ కు అర్హత సాధించారు.