శవాలనూ సొమ్ము చేసుకున్నాడు.. పీక్ లో సందీప్ ఘోష్ అవినీతి
- ఆర్జీ కర్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ పై తీవ్ర ఆరోపణలు
- కాంట్రాక్టుల్లో 20 శాతం కమీషన్ ముట్టజెప్పాల్సిందే
- బంగ్లాదేశ్ కు అక్రమంగా మందుల ఎగుమతి
- సిట్ విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్న వైనం
గతంలోనే ఫిర్యాదులు..
సందీప్ ఘోష్ అవినీతికి సంబంధించి గతంలోనే డాక్టర్ అక్తర్ అలీ ఫిర్యాదు చేశారు. అయితే, విచారణ మాత్రం జరగలేదు. తాజాగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బృందం అక్తర్ ను విచారణకు పిలిచింది. ఆయన ఫిర్యాదుతో సందీప్ పై కేసు నమోదు చేసింది. అక్తర్ అలీ గతేడాది వరకు ఆర్జీ కర్ ఆసుపత్రిలోనే పనిచేశారు. ప్రస్తుతం ఆయన ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ డిప్యూటీ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సందీప్ అక్రమాలు స్వయంగా చూశాక అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అక్తర్ చెప్పారు.
సందీప్ బంగ్లాదేశ్ కు మందులు ఎగుమతి చేస్తున్నారని, కమీషన్ పుచ్చుకుని కాంట్రాక్టులు కట్టబెట్టేవారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులకు అప్పట్లోనే తాను ఓ లేఖ రాసినట్టు సిట్ అధికారులకు చెప్పారు. ఆసుపత్రి ఆస్తులను తన సొంత ఆస్తుల్లాగా లీజుకు ఇచ్చేవారని, మందుల సరఫరా కాంట్రాక్టులను సందీప్ ఘోష్ తన బంధుమిత్రులకు కట్టబెట్టేవారని మండిపడ్డారు. పరీక్షల్లో ఫెయిలైన వైద్య విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకునే వారని అన్నారు. అనాథ శవాలను అమ్ముకునే వారని, ఆసుపత్రిలో పోగయ్యే వ్యర్థాలను రీసైక్లింగ్ చేయించి సొమ్ము చేసుకునేవారని అక్తర్ అలీ ఆరోపించారు.