అక్రమ కేసులు, అరెస్టులు తప్ప జగన్ చేసిందేమీ లేదు: కొల్లు రవీంద్ర

  • ఐదేళ్ల పాలనలో జగన్ చేసిందేమీ లేదన్న కొల్లు రవీంద్ర
  • మత్స్యకారుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసేలా జీవో 217 తీసుకొచ్చారని మండిపాటు
  • మత్స్యకార సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ
మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం తప్ప ఐదేళ్ల పాలనలో జగన్ చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆధ్వర్యంలో జీవో 217 రద్దు అభినందన సభ ఈరోజు ఏలేశ్వరంలో జరిగింది. ఈ సభకు కొల్లు రవీంద్ర కూడా హాజరయ్యరు. 

ఈ సందర్భంగా రవీంద్ర మాట్లాడుతూ... మత్స్యకారుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టేసేలా జీవో 217 తీసుకొచ్చారని... మత్స్యకారులకు ఉన్న హక్కులను ప్రైవేటు పరం చేసేందుకు యత్నించారని విమర్శించారు. ఈ జీవోను రద్దు చేయడం ద్వారా మత్స్యకారుల హక్కులను కాపాడామని చెప్పారు. త్వరలోనే మత్స్యకార సొసైటీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


More Telugu News

Kollu Ravindra Telugudesam Jagan YSRCP