హైకోర్టును ఆశ్రయించిన దువ్వాడ శ్రీనివాస్ .. పోలీసులకు నోటీసులు
- దువ్వాడ శ్రీనివాస్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ
- పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు
- తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
ముందుగా పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు అయిదు రోజుల క్రితమే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. నిందితులు వాణి, హైందవిలకు సెక్షన్ 41(ఏ) నోటీసులు ఇచ్చి విచారణ కోరారని చెప్పారు. మరో పక్క దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన అర్ధాంగి వాణి సైతం ఫిర్యాదు చేశారని, పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.