తిరుమలలో నకిలీ రూ.300 దర్శన టికెట్ల పట్టివేత
- కలర్ జిరాక్స్ కాగితాలతో భక్తులకు టోకరా
- చెన్నై భక్తుడ్ని మోసం చేసిన రుద్రసాగర్, అమృతయాదవ్
- కేసు నమోదు చేసిన పోలీసులు
రుద్రసాగర్, పాత నేరస్తుడు అమృతయాదవ్ కలిసి చెన్నైకి చెందిన మోహన్ రాజ్ అనే భక్తుడ్ని మోసం చేశారు. 4 టికెట్లకు రూ.11 వేలు వసూలు చేసి నకిలీ టికెట్లు అంటగట్టారు. కాగా, రుద్రసాగర్, అమృతయాదవ్ ఆగస్టు 17న 35 మంది భక్తులకు ఇలాగే నకిలీ టికెట్లతో దర్శనం చేయించిన వైనం కూడా బయటపడింది.
ఈ నేపథ్యంలో, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్ల స్కానింగ్ ఉద్యోగి రుద్రసాగర్ పై కేసు నమోదు చేశారు. పాత నేరస్తుడు అమృతయాదవ్ పైనా పోలీసులు కేసు నమోదు చేశారు.