పనిచేస్తున్న జువెలర్స్ షాపులో ఆభరణాల చోరీ.. తాకట్టుపెట్టి ప్రియురాలితో కలిసి ఆలయాల సందర్శన
- హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఘటన
- శ్రీసిద్ధి వినాయక జువెలర్స్‌లో 8 ఏళ్లుగా పనిచేస్తున్న నిందితుడు
- చెప్పాపెట్టకుండా మానేయడం, ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం
- 28 గ్రాముల ఆభరణాలు, 8 గ్రాముల వజ్రాల నెక్లెస్ చోరీ
- ప్రియురాలితో కలిసి జల్సాలు
శ్రీ సిద్ధి వినాయక జువెలర్స్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతడు చెప్పింది విని విస్తుపోయారు. కనిపించకుండా పోయిన 28 గ్రాముల బంగారంతోపాటు 8 గ్రాముల డైమండ్ నెక్లెస్‌ను కూడా దొంగిలించినట్టు అంగీకరించాడు. వాటిలో కొన్నింటిని మణప్పురం గోల్డ్‌లోన్ కంపెనీలో తాకట్టు పెట్టి గాళ్ ఫ్రెండ్‌తో కలిసి ఆలయాలు సందర్శించినట్టు చెప్పడంతో పోలీసులు షాకయ్యారు. అతడి నుంచి 3 గ్రాముల బంగారంతోపాటు తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్‌ను రికవరీ చేశారు.