ప్రభాస్ లేని 'బాహుబలి'ని ఊహించలేం: సీఎం రేవంత్ రెడ్డి
- హైదరాబాదులో క్షత్రియ సేవా సమితి అభినందన సభ
- హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- బాహుబలి హాలీవుడ్ వరకు వెళ్లిందంటే ప్రభాసే కారణమని వెల్లడి
- రాజులు ఏ రంగంలో ఉన్నా రాణిస్తారని కితాబు
ఇవాళ హైదరాబాదులో క్షత్రియ సేవా సమితి నిర్వహించిన అభినందన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ప్రభాస్ తెలుగు సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. రాజులు ఏ రంగంలోకి వచ్చినా రాణిస్తారని, కృష్ణంరాజు పేరు ప్రస్తావించకుండా తెలుగు సినీ పరిశ్రమ గురించి మాట్లాడలేమని అన్నారు. బాలీవుడ్ లో రాణించిన రాంగోపాల్ వర్మ తనకు మంచి మిత్రుడని తెలిపారు.
"నాకన్నా గొప్ప వాళ్లు ఇవాళ ఈ వేదిక ముందు వినయంగా ఉన్నారు... క్షత్రియుల గొప్పదనం అదే. నమ్మకానికైనా, విజయానికైనా క్షత్రియులు మారు పేరుగా నిలుస్తారు" అని రేవంత్ రెడ్డి వివరించారు.