కోల్కతా ఆసుపత్రి ధ్వంసం ఘటన.. మమత ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
- ఆర్జీకర్ ఆసుపత్రిపై మూకదాడి.. విధ్వంసం
- పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్న హైకోర్టు
- 7 వేల మంది అక్కడికి కాలినడకన రాలేరని వ్యాఖ్య
- 144 సెక్షన్ విధించకుండా పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీత
- ఇలాంటి పరిస్థితుల మధ్య వైద్యులు ఎలా పనిచేస్తారని ప్రశ్న
ఈ ఘటనపై ప్రభుత్వాన్ని మందలించిన న్యాయస్థానం.. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారని, మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయస్థానం ప్రశ్నించింది. 7 వేల మంది ఒకేసారి నడుచుకుంటూ ఆసుపత్రి వద్దకు రావడం అసాధ్యమని అభిప్రాయపడింది. వైద్యులు తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత అని పేర్కొంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఇప్పటికే అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.