మద్యం మత్తులో 13 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగికదాడి
- ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఘటన
- ఆ తర్వాత రెండు రోజులకే బాలిక తల్లి మృతి
- తాజాగా తండ్రిపై ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి
ఘటన జరిగిన రోజున బాధిత బాలిక తల్లి ఢిల్లీలోని తన సోదరి ఇంటికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. తాగి ఇంటికి వచ్చిన తండ్రి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఢిల్లీ వెళ్లిన బాలిక తల్లి రెండు రోజుల తర్వాత ఈ నెల 10న అక్కడే మృతి చెందింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.