Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మద్యం మత్తులో 13 ఏళ్ల కుమార్తెపై తండ్రి లైంగికదాడి

Father rapes daughter in Amethi
Advertisement
  • ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఘటన
  • ఆ తర్వాత రెండు రోజులకే బాలిక తల్లి మృతి
  • తాజాగా తండ్రిపై ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి
Advertisement
మద్యం మత్తులో విచక్షణ మరిచిన ఓ తండ్రి కన్న కూతురిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో ఈ నెల 8 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దారుణం జరిగిన వారం రోజుల తర్వాత బాధిత బాలిక ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత తల్లి చనిపోవడంతో ఫిర్యాదు చేయలేకపోయానని తెలిపింది. 

ఘటన జరిగిన రోజున బాధిత బాలిక తల్లి ఢిల్లీలోని తన సోదరి ఇంటికి వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. తాగి ఇంటికి వచ్చిన తండ్రి ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఢిల్లీ వెళ్లిన బాలిక తల్లి రెండు రోజుల తర్వాత ఈ నెల 10న అక్కడే మృతి చెందింది. బాలిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Advertisement
Advertisement
Crime News
Amethi
Uttar Pradesh

More Telugu News