కాబోయే భర్త ఏం చేస్తాడంటే: యూ ట్యూబర్ ఈఆర్ యామిని!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాబోయే భర్త ఏం చేస్తాడంటే: యూ ట్యూబర్ ఈఆర్ యామిని!

ER Yamini Interview
  • యూ ట్యూబర్ గా యామినికి మంచి పేరు 
  • యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ 
  • సంబంధం కుదిరిందని చెప్పిన తండ్రి
  • అబ్బాయి లండన్ లో సైట్ ఇంజనీర్ అని వెల్లడి  

యూ ట్యూబ్ వీడియోస్ చేయడంలో ఈఆర్ యామినికి ఒక ప్రత్యేకత ఉంది. యామిని వస్త్రధారణ .. ఆమె ఎంచుకునే పాటలు సంప్రదాయ బద్ధంగా ఉంటాయి. అచ్చతెలుగు అమ్మాయి అంటే యామినియే అనే పేరు ఆమెకి ఉంది. దాదాపు తన వీడియోస్ లో ఆమె చీరకటుతోనే కనిపిస్తూ ఉంటుంది. అందువలన యూత్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఆమె వీడియోస్ ను ఫాలో అవుతూ ఉంటారు. 

యామినీకి బయట విపరీతమైన క్రేజ్ ఉంది. అందువలన ఆమె నిన్న మొన్నటి వరకూ తన ఊరు పేరు చెప్పడానికి కూడా ఇష్టపడలేదు. అలాంటి యామినికి పెళ్లి కుదిరింది అనే ఒక టాక్ ఈ మధ్య వినిపించింది. తాజాగా 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందుకు సంబంధించిన ప్రశ్న ఆమెకి ఎదురైంది. 

తనకి చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అంటే ఇష్టమనీ, అందువల్లనే నేర్చుకున్నానని యామిని చెప్పింది. ఇక తనకి చీరలంటే ఇష్టమనీ, అందువల్లనే చీరకట్టుతోనే కనిపిస్తూ ఉంటానని అంది. తమ దగ్గర బంధువుల అబ్బాయితో ఆమె పెళ్లి ఖాయమైందనీ, అతను లండన్ లో సైట్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడని యామిని తండ్రి చెప్పారు. ఇక పెళ్లి తరువాత కూడా తన నుంచి వీడియోస్ వస్తుంటాయని యామిని చెప్పడం విశేషం.

Advertisement
ER Yamini
You Tuber

More Telugu News