బ్రెజిల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 62 మంది దుర్మరణం
- నిన్న విన్హెడో టౌన్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలిన విమానం
- విమానంలోని వారందరూ మరణించినట్టు అధికారుల ప్రకటన
- ఘటనపై విచారం వ్యక్తం చేసిన దేశాధ్యక్షుడు లూలా డ సిల్వా
ఈ ఘటనలో విమానంలోని వారందరూ మరణించారని, ఓ ఇల్లు కూడా ధ్వంసమైందని అధికారులు తెలిపారు. అయితే, స్థానికులు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదని అన్నారు. ప్రమాదం విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.
విమాన ప్రమాదంపై దేశాధ్యక్షుడు లూలా డ సిల్వా విచారం వ్యక్తం చేశారు. విమానంలోని వారందరూ మృతి చెందారని తెలిపారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ ఎటువంటి ప్రకటనా చేయలేదు.