సీఎం గారూ... కువైట్లో నన్ను కొడుతున్నారు... కాపాడండి: రేవంత్ రెడ్డికి నిర్మల్ వాసి విజ్ఞప్తి
- సీఎంకు మొరపెట్టుకున్న ముథోల్ మండలం రువ్వి గ్రామవాసి
- తనను స్వదేశానికి తీసుకువెళ్లేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- తనను ఏజెంట్ మోసం చేశాడన్న రాథోడ్ నాందేవ్
ముథోల్ మండలం రువ్వి గ్రామానికి చెందిన రాథోడ్ నాందేవ్ పది నెలల క్రితం కువైట్ వెళ్లాడు. ఇంట్లో పని అని చెప్పి ఓ ఏజెంట్ తనను కువైట్ పంపించినట్లు చెప్పాడు. కానీ కువైట్ చేరుకున్నాక తనను మోసం చేసినట్లు తెలిసిందని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఎడారిలో ఒంటెల కాపరిగా పని చేస్తున్నానని, తనను కొడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఇక్కడి నుంచి తీసుకువెళ్లేలా చూడాలని కోరాడు.