ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ రాజీనామా.. ఎన్నిక ఎప్పుడంటే ..!
- విజయవాడలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం
- గుంటూరులో సెప్టెంబర్ 8న ఏసీఏ ఎన్నిక
- ఎన్నికల అధికారిగా రిటైర్డ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ
వచ్చే నెల (సెప్టెంబర్) 8న గుంటూరులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని నిర్ణయించిన సర్వసభ్య సమావేశం .. ఎన్నికల పర్యవేక్షలుగా రిటైర్డ్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను నియమించింది. ఈ సర్వసభ్య సమావేశానికి 33 మంది సభ్యులు హజరుకాగా, సమావేశానికి విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చైర్మన్ గా వ్యవహరించారు. సమావేశం అనంతరం విష్ణుకుమార్ రాజు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత సభ్యులందరం కలిసి క్రికెటర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, స్టేడియాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.