ICC Test rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో భారత్

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ జట్టు టాప్-2 స్థానంలో కొనసాగుతోంది. 120 రేటింగ్ పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. టెస్ట్ ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా జట్టు నంబర్ 1 జట్టుగా కొనసాగుతోంది. 124 రేటింగ్‌ పాయింట్లతో ఆ జట్టు అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రాణిస్తున్న ఇంగ్లండ్ జట్టు మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు వద్ద 105 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక నాలుగవ స్థానంలో దక్షిణాఫ్రికా జట్టు నిలిచింది.

డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ టాప్..
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ 2023-25లో భారత్ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. మొత్తం 74 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. 68.52 శాతం విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 9 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన భారత్ ఆరు విజయాలు సాధించింది. జూన్ 2025లో డబ్ల్యూటీసీ ఫైనల్‌ స్థానమే లక్ష్యంగా దూసుకెళ్తోంది. కాగా గత రెండు డబ్ల్యూటీసీ ఎడిషన్లలో ఫైనల్ ఆడినప్పటికీ టైటిల్‌ గెలవలేకపోయిన విషయం తెలిసిందే.
ICC Test rankings
WTC Points table
Cricket
Team India

More Telugu News