తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు

Rains in Telangana for two days
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడవచ్చునని తెలిపింది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పలుచోట్ల బలమైన గాలులు వీచే అవకాశముందని వెల్లడించింది. 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు ఉండవచ్చునని తెలిపింది.
Go Back to Shorts
Rain
Telangana

More Telugu News