రేపు తెలంగాణలో రెండో విడత రైతు రుణమాఫీ
- ఇప్పటికే అమలైన రూ.1 లక్ష లోపు రుణమాఫీ
- రూ.1.5 లక్షన్నర లోపు రుణం ఉన్న రైతులకు రేపు మాఫీ
- రెండో విడత కోసం రూ.7 వేల కోట్లు అవసరమవుతాయన్న అధికారులు
మరోవైపు, మూడో విడత రుణమాఫీ ఆగస్ట్ 14వ తేదీ తర్వాత జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్ట్ 2 నుంచి 14వ తేదీ వరకు విదేశీ పర్యటనలో ఉంటారు. ఆయన తిరిగి రాష్ట్రానికి వచ్చాక రూ.2 లక్షల రుణమాఫీ ఉండనుంది. మొదటి విడతలో భాగంగా రూ.1 లక్ష లోపు రుణాలను మాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇందుకోసం రూ.6,093 కోట్లు బ్యాంకులకు చెల్లించింది. మూడు దశల్లో చేయనున్న రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు ఖర్చవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది.