ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూసి 9 ఏళ్ల చెల్లెలిపై 13 ఏళ్ల అన్న అఘాయిత్యం.. ఆపై హత్య
- మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఘటన
- తల్లికి చెబుతానని బెదిరించడంతో గొంతు నులిమి చంపేసిన బాలుడు
- సహకరించిన తల్లి, ఇద్దరు అక్కలు
పోలీసుల కథనం ప్రకారం.. ఘటన జరిగిన రోజు రాత్రి బాలిక నిద్రిస్తుండగా, మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూసిన నిందితుడు చెల్లెలిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భయపడిపోయిన బాలిక ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని బెదిరించడంతో ఆమె గొంతు నులిమి చంపేశాడు.
ఆ తర్వాత తల్లిని లేపి విషయం చెప్పాడు. ఆమె లేచి కుమార్తెను చూసింది. అప్పటికీ ఇంకా ఆమె ఊపిరి తీసుకుంటుండడంతో బాలుడు మరోమారు ఆమె గొంతు నులిమి చంపేశాడు. ఈ గొడవతో నిద్రలేచిన నిందితుడి అక్కలు ఇద్దరు బెడ్‌పై ఉన్న మరకలను తొలగించారు. బాలిక మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో అతడితోపాటు సహకరించిన తల్లి, ఇద్దరు అక్కలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.