రాహుల్ గాంధీకి కొత్త బంగ్లాను ఆఫర్ చేసిన లోక్ సభ హౌస్ కమిటీ
- సునేహ్రి బాగ్ రోడ్డులో బంగ్లా నెంబర్ 5ని ఆఫర్ చేసిన కమిటీ!
- ఈ ఇంటికి సంబంధించి రాహుల్ గాంధీ నుంచి సమాధానం రావాల్సి ఉంది
- రాహుల్ గాంధీ టైప్ 8 బంగ్లాకు అర్హులు
లోక్ సభలో ఆయన ప్రతిపక్ష నేత కాబట్టి కేబినెట్ ర్యాంక్ కలిగి ఉన్నారు. ఆయన టైప్ 8 బంగ్లాకు అర్హులు. టైప్ 8 బంగ్లాను కేబినెట్ మంత్రులు, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు, సహాయమంత్రులు, కేంద్ర ప్రభుత్వంలోని కీలక కార్యదర్శులకు కేటాయిస్తారు.