‘జియో ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘జియో ఎయిర్ ఫైబర్’ యూజర్లకు గుడ్‌న్యూస్

Jio has launched a new offer for its Jio AirFiber users
  • ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ
  • ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ ప్రకటించిన జియో
  • జులై 26 నుంచి ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండనున్న ఆఫర్
‘ఎయిర్ ఫైబర్’ యూజర్లకు జియో గుడ్‌న్యూస్ చెప్పింది. ‘జియో ఫ్రీడమ్ ఆఫర్’ పేరిట ఇన్‌స్టలేషన్ ఛార్జీలు లేకుండానే కొత్త జియో ఎయిర్‌ ఫైబర్ కనెక్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. కొత్త కనెక్షన్‌ను పొందాలనుకునే నూతన యూజర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఇది పరిమిత కాల ఆఫర్‌. ఇప్పటికే కనెక్షన్ తీసుకున్న వినియోగదారులతో పాటు కొత్తగా కనెక్షన్‌ను బుక్ చేసుకునేవారికి ఈ ఆఫర్ వస్తుందని పేర్కొంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

‘ఫ్రీడమ్ ఎయిర్‌ ఫైబర్’ ఆఫర్ కింద కొత్త యూజర్లకు ఏకంగా 30 శాతం డిస్కౌంట్ లభిస్తుందని జియో తెలిపింది. జులై 26 నుంచి ఆగస్టు 15 మధ్య కొత్తగా చేరే కస్టమర్లకు ఇన్‌స్టలేషన్ ఛార్జీలు రూ.1000 మాఫీ అవుతాయని వివరించింది. 3 నెలలు, 6 నెలలు, 12 నెలల 5జీ, 5జీ ప్లస్ ప్లాన్లను ఎంచుకునే నూతన వినియోగదారులు అందరికీ జీరో ఇన్‌స్టలేషన్ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది.

ప్లాన్ రేటు ఎంతంటే..
జియో ఫ్రీడమ్ ఆఫర్ 3 నెలల ఆల్ ఇన్ వన్ ప్లాన్‌కు ప్రస్తుతం రూ. 3,121 చెల్లించాల్సి వస్తోంది. ఇందులోనే రూ.1000 ఇన్‌స్టలేషన్ ఛార్జీలు కలిపి ఉంటాయి. ఇవి మాఫీ అవుతాయి కాబట్టి కొత్త యూజర్లు రూ. 2,121లకే జియో ఎయిర్‌ఫైబర్ కనెక్షన్ పొందవచ్చు.
Advertisement
Jio AirFiber
Jio
Jio Freedom Offer
Jio Offers

More Telugu News