శంషాబాద్ నుంచి విమానాల రాకపోకల పునరుద్ధరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ నుంచి విమానాల రాకపోకల పునరుద్ధరణ

Resumption of flights from shamshabad airport
  • 'మైక్రోసాఫ్ట్‌' సమస్య పరిష్కారం కావడంతో రాకపోకల పునరుద్ధరణ
  • విండోస్‌లో నిన్న సాంకేతిక సమస్య రావడంతో నిలిచిన సేవలు
  • ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారుల ప్రయత్నం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో రాకపోకలను పునరుద్ధరించారు. మైక్రోసాఫ్ట్ విండోస్‌లో నిన్న సాంకేతిక సమస్య రావడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ సేవలు దెబ్బతిన్నాయి. శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాటిలో వెళ్లాల్సిన ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు అధికారులు, విమానయాన సంస్థలు ఆలోచిస్తున్నాయి.
Advertisement
Shamshabad Airport
Microsoft

More Telugu News