అమూల్ బటర్ మిల్క్ ప్యాకెట్ లో పురుగులు.. వీడియో ఇదిగో!
- ఆన్ లైన్ లో అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేసిన కస్టమర్ షాక్
- సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియో వైరల్
- సారీ చెప్పిన అమూల్ కంపెనీ
- మరోసారి రిపీట్ కానివ్వబోమని హామీ
అమూల్ కస్టమర్ ఒకరు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ట్విట్టర్ లో నెటిజన్లతో పంచుకున్నారు. ఇటీవల తాను ఆన్ లైన్ వేదికగా అమూల్ బటర్ మిల్క్ ఆర్డర్ చేశానని చెప్పారు. అయితే, కంపెనీ నుంచి వచ్చిన ప్యాకెట్ ను విప్పిచూశాక షాక్ కు గురయ్యానని వివరించారు. ప్యాకెట్ లో పురుగులు కనిపించడమే కారణమని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. తమకూ ఇలాంటి అనుభవమే ఎదురైందని, అమూల్ ఉత్పత్తులు ఎవరూ కొనొద్దని కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోను ఏకంగా నాలుగున్నర లక్షల మంది చూశారు. వీడియో వైరల్ కావడంతో అది అమూల్ కంపెనీ దాకా చేరింది. దీంతో సదరు కంపెనీ వివరణ ఇచ్చింది. కస్టమర్ కు క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని కస్టమర్ కు హామీ ఇచ్చింది.