'ఏం జరిగినా ముందు టీడీపీ మీద తోసేయడమే..' అంటూ మండిపడిన టీడీపీ!
- వినుకొండ మర్డర్ పై టీడీపీ రియాక్షన్
- హతుడు, హంతకుడు ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనని వివరణ
- వినుకొండ వైసీపీ నేత పీఎస్ ఖాన్ అనుచరులేనని వెల్లడి
బుధవారం జరిగిన దారుణ హత్యలో చనిపోయిన రషీద్, చంపిన షేక్ జిలానీ.. ఇద్దరూ వైసీపీ కార్యకర్తలేనని ట్వీట్ లో పేర్కొంది. ఇద్దరూ వైసీపీ నేత, స్థానిక రౌడీగా పేరొందిన పీఎస్ ఖాన్ కు ప్రధాన అనుచరులేనని వెల్లడించింది. సదరు పీఎస్ ఖాన్ వైసీపీ చీఫ్ జగన్ కు ప్రధాన అనుచరుడని వివరించింది. అయితే, తప్పు ఎవరు చేసినా తప్పేనని, తప్పు చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేసింది. గడిచిన ఐదేళ్లలో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయిన వైసీపీ సైకోలకు పట్టిన మదం దించి, వారు చేసే దారుణాలను ఆపడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గంజాయిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.