నేటి మధ్యాహ్నం ప్రజాభవన్‌లో టీపీసీసీ సమావేశం
- మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ భేటీ
- పాల్గొననున్న సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, తదితరులు
- ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై చర్చ
పార్టీ కార్యక్రమాలపై టీపీసీసీ చర్చించనుంది. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను జనంలోకి తీసుకు వెళ్లడంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశనం చేయనున్నారు.