యుద్ధాన్ని ముగించేలా పుతిన్‌తో మాట్లాడండి: భారత్‌కు అమెరికా విజ్ఞప్తి
- భారత్-రష్యా సంబంధం సుదీర్ఘమైనదన్న అమెరికా
- ఈ సంబంధాన్ని యుద్ధానికి ముగింపు పలికేలా ఉపయోగించాలని విన్నపం
- ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు చెప్పాలని అమెరికా విజ్ఞప్తి
ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ఢిల్లీ-మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో యూఎన్ చార్టర్‌ను గౌరవించాలని పుతిన్‌కు చెప్పాలని కోరారు. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు సూచించాలని మిల్లర్ పేర్కొన్నారు.