ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే ఢిల్లీలో చంద్రబాబులా చక్రం తిప్పవచ్చు!: కేటీఆర్
- ఏపీ అభివృద్ధికి చంద్రబాబు 1 ట్రిలియన్ రూపాయలు కేంద్రాన్ని అడిగినట్లుగా బ్లూమ్‌బర్గ్ కథనం
- కథనాన్ని ట్వీట్ చేసిన జర్నలిస్ట్ మనేకా దోశి
- తెలంగాణ ప్రజలు వీటినన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారన్న కేటీఆర్
మనేకా దోశి ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు. ప్రాంతీయ పార్టీలను గెలిపించుకుంటే ఢిల్లీలో ఎలా చక్రం తిప్పవచ్చో... ఈ అంశం ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు వీటినన్నింటినీ నిశితంగా గమనిస్తున్నారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. స్వీయ రాజకీయ అస్థిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని కేటీఆర్ పునరుద్ఘాటించారు.