పారిస్ ఒలింపిక్స్ లో భారత బృందానికి స్పాన్సర్ గా అదానీ గ్రూప్
- ఈసారి ఒలింపిక్ క్రీడలకు పారిస్ ఆతిథ్యం
- జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఒలింపిక్ క్రీడలు
- స్పాన్సర్ గా భారత అథ్లెట్లకు పూర్తి మద్దతు ఇస్తామన్న గౌతమ్ అదానీ
113 మంది అథ్లెట్లతో కూడిన భారత బృందానికి పారిస్ ఒలింపిక్స్ లో అదానీ గ్రూప్ ప్రధాన స్పాన్సర్ గా వ్యవహరించనుంది. ఈ మేరకు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ వెల్లడించారు. ఓ స్పాన్సర్ గా భారత అథ్లెట్లకు సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.
కాగా, 'దేశ్ కా గీత్ ఎట్ ఒలింపిక్స్' పేరిట భారత అథ్లెట్లకు మద్దతుగా ఓ వీడియోను కూడా అదానీ గ్రూప్ సిద్ధం చేసింది. పారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి.