ఒకే జాతి పక్షులు ఒకరికొకరు 'సర్టిఫికెట్' లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి.. కేటీఆర్ కు ఏపీ మంత్రి సత్యకుమార్ కౌంటర్

10-07-2024 Wed 10:24 | Andhra
Advertisement
  • ఏపీలో వైసీపీ ఓటమి దిగ్భ్రాంతి కలిగించిందన్న కేటీఆర్
  • ధర్మవరంలో కేతిరెడ్డి ఓడిపోవడం ఏంటని వ్యాఖ్యలు
  • కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారన్న మంత్రి సత్యకుమార్
Advertisement
ఏపీలో వైసీపీ ఓటమి దిగ్భ్రాంతి కలిగించిందని, ముఖ్యంగా ధర్మవరంలో కేతిరెడ్డి ఓటమి చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని, కేతిరెడ్డి వంటి వ్యక్తి ఓడిపోవడం ఏంటని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడం తెలిసిందే. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రి వై.సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో బదులిచ్చారు. 

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓటమిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని మండిపడ్డారు. 

"ధరణి పేరుతో తెలంగాణలో మీరు నడిపిన భూ మాఫియా మాదిరే ధర్మవరంలో గుడ్ మార్నింగ్ పేరుతో మీ భూ బకాసుర మిత్రుడు ప్రభుత్వ, అసైన్డ్, ప్రైవేటు, ప్రజల ఆస్తులను ఆక్రమించాడు. చివరికి చెరువులు, కొండలను కూడా అతడు కబళించాడు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకు వచ్చేది కబ్జా... కలెక్షన్... కరప్షన్... కమీషన్లే! ఫాంహౌస్ కు పరిమితమైన మీరు ఎక్స్ లో అడిగినా అతడి గురించి ధర్మవరం ప్రజలు సమాధానం చెబుతారు.

మీ అవినీతిని ప్రశ్నిస్తూ నిర్మాణాత్మక విమర్శ చేసినందుకు నాలుగు సంవత్సరాల క్రితం నన్ను ఎక్స్ (ట్విట్టర్) లో బ్లాక్ చేశారు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థతే మిమ్మల్ని, మీ ప్రియమిత్రులు జగన్, కేతిరెడ్డిలను ఓడించాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు 'సర్టిఫికెట్' లు ఇచ్చుకుంటూ ఓదార్చుకోండి" అంటూ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.

ఇటీవలి ఎన్నికల్లో సత్యకుమార్ యాదవ్ బీజేపీ అభ్యర్థిగా ధర్మవరం నుంచి పోటీ చేసి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కేతిరెడ్డిని ఓడించడం తెలిసిందే.
Advertisement
Y.Satya Kumar YadavKTRKethireddyDharmavaramBJPYSRCPAndhra PradeshTelangana

More Telugu News

ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుమీద జరుగుతున్నది గ్యాంగ్‌ వార్‌ మాత్రమే: విజయసాయిరెడ్డి

25-10-2026 Sun 14:13

సైకిల్‌పై డెలివరీలు.. బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు ఊహించని కానుక.. వైరల్ అవుతున్న వీడియో!

25-10-2026 Sun 14:08

డ్రంకెన్‌ డ్రైవ్‌లో హల్‌చల్.. కానిస్టేబుల్‌ను కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో వైర‌ల్‌!

25-10-2026 Sun 13:43

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్ణబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51
..more