ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం.. ప్రదానం చేసిన పుతిన్
- రష్యాలో పర్యటిస్తున్న ప్రధాని మోదీ
- ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ అండ్రూ పురస్కారం అందించిన రష్యా ప్రభుత్వం
- భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి మోదీ చేసిన కృషికి గుర్తింపు
దీనిపై మోదీ స్పందించారు. తనకు రష్యా ప్రభుత్వం ది ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ పురస్కారం అందించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని తెలిపారు. రష్యా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. ఈ అవార్డును నా దేశ 140 కోట్ల మంది ప్రజలకు అంకితం ఇస్తున్నాను అని మోదీ ట్వీట్ చేశారు.