వాయిదా పడిన నీట్ యూజీ కౌన్సెలింగ్
- పేపర్ లీక్ ఆరోపణలతో ఎగ్జాం రద్దు కోసం సుప్రీంను ఆశ్రయించిన విద్యార్థులు, పేరెంట్స్
- ఈ నెల 8న విచారించనున్న అత్యున్నత న్యాయస్థానం
- ఈ నేపథ్యంలోనే కౌన్సెలింగ్ రద్దు చేసినట్లు సమాచారం
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయని, పేపర్ లీక్ అయిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఆందోళన చెందిన పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టు మెట్లెక్కారు. నీట్ పరీక్షను రద్దు చేయాలని, ఈమేరకు ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. పలువురు విద్యావేత్తలు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలో స్పందిస్తూ.. పరీక్షను రద్దు చేయడం, కౌన్సెలింగ్ ను వాయిదా వేయడం కుదరదని వ్యాఖ్యానించింది. అయితే, నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పిటిషన్లను విచారించేందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది.