రేపు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ అక్కడే...!

  • రేపు సాయంత్రం 4 గంటలకు ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ
  • హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • హైదరాబాద్‌లో చంద్రబాబుకు స్వాగత తోరణాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం నాలుగు గంటలకు సమావేశం కానున్నారు. వీరి భేటీకి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఏర్పాట్లు చేస్తున్నారు. విభజన సమస్యలు, రెండు రాష్ట్రాల మధ్య పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అంశాలపై చర్చించేందుకు ఇరు రాష్ట్రాల సీఎంలు రేపు హైదరాబాద్‌లో భేటీ కానున్నారు.

చంద్రబాబు రాక... హైదరాబాద్‌లో స్వాగత తోరణాలు

చంద్రబాబు రాక నేపథ్యంలో తెలంగాణ టీడీపీ నాయకులు హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో పలు రోడ్లపై చంద్రబాబుకు స్వాగతం చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఆహ్వాన ఫ్లెక్సీలు నెట్టింట వైరల్‌గా మారాయి.


More Telugu News

Chandrababu Revanth Reddy Telangana Andhra Pradesh