బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు
కాగా బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హస్తం గూటికి చేరిన విషయం తెలిసిందే. కాగా త్వరలోనే మరికొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి.