కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు!
- ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మూడు నెలల క్రితం అరెస్టయిన కవిత
- సాయంత్రం ఐదు గంటలకు రానున్న తీర్పు
- బెయిల్ ఇవ్వాలని వాదనలు వినిపించిన కవిత తరఫు న్యాయవాది
సీబీఐ అవినీతి కేసుతో పాటు ఈడీ మనీలాండరింగ్ కేసులో కవిత బెయిల్ దరఖాస్తులను కొట్టివేస్తూ మే 6న ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె సవాల్ చేశారు. ఈ కేసులోని 50 మంది నిందితుల్లో కవిత ఒక్కరే మహిళ అని, దీనిని పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే ఈ వాదనను సీబీఐ, ఈడీ వ్యతిరేకించాయి. ఈ క్రమంలో నేడు సాయంత్రం తీర్పు రానుంది.