యేసు క్రీస్తు వేషధారణలో ట్రంప్ ఏఐ చిత్రం: వెల్లువెత్తుతున్న విమర్శలు

Donald Trump AI Image as Jesus Sparks Controversy

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో క్రైస్తవ మతగురువు పోప్ లియో తనపై చేసిన విమర్శలకు ప్రతిస్పందనగా, ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక ఏఐ చిత్రాన్ని షేర్ చేశారు. ఆ చిత్రంలో ట్రంప్ యేసు క్రీస్తు గెటప్‌లో ఉండి, ఒక వ్యక్తికి సాంత్వన చేకూరుస్తున్నట్లుగా ఉంది.


ట్రంప్ షేర్ చేసిన ఈ చిత్రంపై ఆన్‌లైన్ వేదికగా మిశ్రమ స్పందన వస్తోంది. మత సంఘాలు, నెటిజన్లు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవిత్రమైన యేసు క్రీస్తు రూపాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత బ్రాండింగ్ కోసం వాడుకోవడం క్రీస్తును అవమానించడమేనని పలువురు మండిపడుతున్నారు. ఇది కేవలం రాజకీయ స్వార్థంతో కూడిన చర్య అని, మతపరమైన మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


మరోవైపు, ట్రంప్ మద్దతుదారులు ఈ చిత్రాన్ని సమర్థిస్తున్నారు. ఇది కేవలం ఒక 'డిజిటల్ సెటైర్' అని, విమర్శకులకు సమాధానం చెప్పడానికి సరదాగా పోస్ట్ చేసిన చిత్రమని వారు పేర్కొంటున్నారు.

Go Back to Shorts
Donald Trump
Trump AI image
Jesus Christ
Truth Social
Pope Leo
Religious criticism
Political satire
Iran war

More Telugu News