వింబుల్డ‌న్ టోర్నీ ప్ర‌మోష‌న్స్‌లో భార‌తీయ‌ చిత్రాల ప్రేర‌ణ‌తో పోస్ట‌ర్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వింబుల్డ‌న్ టోర్నీ ప్ర‌మోష‌న్స్‌లో భార‌తీయ‌ చిత్రాల ప్రేర‌ణ‌తో పోస్ట‌ర్లు!

Wimbledon Social Media Page Create Manjummel Boys and Pushpa Poster
  • ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న వింబుల్డ‌న్ టోర్నీ
  • టోర్నీ ప్ర‌మోష‌న్స్‌ను వెరైటీగా ప్లాన్ చేసిన‌ వింబుల్డ‌న్ సోష‌ల్ మీడియా పేజీ
  • 'మంజుమ్మెల్ బాయ్స్‌'ను ప్రేరణ‌గా తీసుకుని 'వింబుల్డ‌న్ బాయ్స్' పోస్ట‌ర్‌
  • 'పుష్ప' పోస్ట‌ర్‌ను తీసుకుని అల్కారాజ్‌తో 'అల్కారాజ్‌3' అంటూ మ‌రో పోస్ట‌ర్ 
  • సామాజిక మాధ్య‌మాల్లో తెగ‌ వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్లు
ప్ర‌తిష్ఠాత్మ‌క గ్రాండ్‌స్లామ్ టోర్నీ వింబుల్డ‌న్ ఇవాళ్టి నుంచి ప్రారంభం అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ నెల‌ 14 వ‌ర‌కు టోర్నీ జ‌ర‌గ‌నుంది. అయితే, ఈ టోర్నీ ప్ర‌మోష‌న్స్‌ను వింబుల్డ‌న్ సోష‌ల్ మీడియా పేజీ వెరైటీగా మొద‌లు పెట్టింది. ఇందులో భాగంగానే భార‌తీయ చిత్రాల పేర్ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకుని ప్ర‌త్యేక పోస్ట‌ర్ల‌ను రూపొందించి విడుద‌ల చేసింది.  

దీనిలో భాగంగా 'మంజుమ్మెల్ బాయ్స్‌'ను ప్రేరణ‌గా తీసుకుని 'వింబుల్డ‌న్ బాయ్స్' అంటూ ఈ టోర్నీలో ఆడుతున్న కీల‌క ప్లేయ‌ర్లతో ఒక పోస్ట‌ర్ విడుద‌ల‌ చేసింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ 'పుష్ప' పోస్ట‌ర్‌ను తీసుకుని గ‌తేడాది వింబుల్డ‌న్ టైటిల్ గెలిచిన‌ డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల‌స్ అల్కారాజ్‌తో 'అల్కారాజ్‌3' అంటూ మ‌రో పోస్ట‌ర్‌ను రిలీజ్‌ చేసింది. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్లు సామాజిక మాధ్య‌మాల్లో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి.

ఇక ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ కార్ల‌స్ అల్కారాజ్‌తో పాటు వ‌ర‌ల్డ్ నం. 01 జ‌న్నిక్ సిన్న‌ర్‌, నోవాక్ జ‌కోవిచ్‌లు టైటిల్‌ ఫేవ‌రెట్లుగా బ‌రిలోకి దిగుతున్నారు. అయితే, మోకాలి శ‌స్త్ర చికిత్స‌ నుంచి కోలుకున్న జ‌కోవిచ్‌కు వింబుల్డ‌న్‌లో సిన్న‌ర్, అల్కరాజ్‌ల రూపంలో గ‌ట్టి పోటీ ఎదుర‌య్యే అవ‌కాశ‌ముంది.
Advertisement
Wimbledon
Manjummel Boys
Pushpa

More Telugu News