భద్రాద్రి పవర్ ప్లాంట్ పై పిడుగు.. భారీగా ఎగిసిపడ్డ మంటలు
- రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందంటున్న అధికారులు
- 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
- పునరుద్ధరణకు సమయం పడుతుందంటున్న ఇంజనీర్లు
ట్రాన్స్ ఫార్మర్ పూర్తిగా ధ్వంసం కావడంతో సుమారు రూ.30 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. మెయిన్ ట్రాన్స్ ఫార్మర్లు ఉండే ప్రాంతంలోనే మంటలు చెలరేగడంతో అధికారులు యూనిట్ 1, 2 లలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. యూనిట్ 1 పునరుద్ధరణకు మరింత సమయం పడుతుందని వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. బీటీపీఎస్సీఈ అధికారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.