షాకింగ్ వీడియో.. ఆడుకుంటున్న చిన్నారి పైనుంచి వెళ్లిన కారు!
- యూపీలోని నోయిడాలో ఘటన
- తీవ్ర గాయాలతో చిన్నారి పరిస్థితి విషమం
- ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్
కాగా, ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా పోలీసులకు సమాచారం అందింది. దాంతో వెంటనే రంగంలోకి దిగిన సెక్టార్-63 పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు కారణమైన వాహనాన్ని సీసీటీవీ ఫుటేజీ ద్వారా గుర్తించారు. పరారీలో ఉన్న కారు డ్రైవర్‌ను పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు.
ఇక దైనిక్ భాస్కర్ నివేదిక ప్రకారం, వీడియోలో కనిపించిన చిన్నారి తల్లిని రింకీగా గుర్తించారు. ఆమె కనౌజియా అనే వ్యక్తికి చెందిన ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తెలిసింది. తల్లీకూతురు ఇంటి గేటు దగ్గర రోడ్డుపై ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది.