ఢిల్లీలోని అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి.. నల్ల ఇంకు చల్లిన దుండగులు
- ఎక్స్‌లో వీడియో పోస్టు చేసిన ఒవైసీ
- ఇలాంటి వాటితో తనను భయపెట్టలేరని వ్యాఖ్య
- అమిత్ షా, స్పీకర్ ఓంబిర్లా కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణ
హోంమంత్రి అమిత్ షా, స్పీకర్ ఓం బిర్లా కనుసన్నల్లోనే ఇది జరిగిందని, ఎంపీల భద్రతకు గ్యారెంటీ ఉందా? అని ప్రశ్నించారు. తన ఇంటిపై దాడిని సావర్కర్ తరహా పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఇలాంటివి తనను భయపెట్టలేవని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని తాను ఎన్నో చూశానని, ఇంకు చల్లి, రాళ్లు విసిరితే తాను భయపడే రకం కాదని స్పష్టం చేశారు.