కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం
- భేటీలో పాల్గొన్న సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు
- నేటితో ముగుస్తోన్న రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి
- ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన స్థానంలో కొత్తవారికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారు. టీ-పీసీసీ అధ్యక్ష పదవిపై పలువురు సీనియర్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పదవీకాలం నేటితో ముగుస్తోంది. దీంతో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక అనివార్యమైంది.