అక్రమ సంపాదన కోసం యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారు: భట్టివిక్రమార్క
- యువత తాత్కాలిక సంతోషాలకు వెళ్లి డ్రగ్స్‌కు బానిస కావొద్దని సూచన
- డ్రగ్స్‌ను నిరోధించేందుకు ఎన్ని నిధులైనా కేటాయిస్తామని వెల్లడి
- అన్ని గ్రామాల్లో డ్రగ్స్ నిరోధక కమిటీలు వేసుకోవాలని సూచన
సంఘ విద్రోహ శక్తుల చేతిలో యువత జీవితాలు నాశనమవుతున్నాయన్నారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి కాపాడుకునే బాధ్యత మనపై ఉందన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు నార్కోటిక్ బ్యూరోకు బడ్జెట్ ఎంతైనా ఇస్తామన్నారు. అన్ని గ్రామాల్లో మాదకద్రవ్యాల నిరోధక కమిటీలు వేసుకోవాలని సూచించారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులపై నిఘా ఉంచాలన్నారు.