అమెరికాలో బాపట్ల వాసి గోపీకృష్ణను కాల్చి చంపిన నిందితుడి అరెస్ట్
- 8 నెలల క్రితమే అమెరికాకు గోపీకృష్ణ
- డల్లాస్‌లోని ఓ కన్వీనియన్స్ స్టోర్‌లో ఉద్యోగం
- ఈ నెల 21న గోపీపై నిందితుడి కాల్పులు
- ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
- నిందితుడి ప్రవర్తన విచిత్రంగా ఉందన్న పోలీసులు
మాథిస్‌పై తొలుత దోపిడీ అభియోగాలు మోపగా, గోపీకృష్ణ మృతితో హత్యానేరం మోపారు. నిందితుడి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉందని పోలీసులు తెలిపారు. గోపీపై కాల్పులు జరపడానికి ముందు రోజు వాకో నగరంలోనూ అతడు కాల్పులు జరిపినట్టు పోలీసులు పేర్కొన్నారు. ముహమ్మద్ హుస్సేన్ (60) అనే వృద్ధుడిపై పలుమార్లు కాల్పులు జరిపాడని, తీవ్రంగా గాయపడిన హుస్సేన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు వివరించారు.