లాంచింగ్‌కు ముందే లీకైన రియల్‌మీ సీ61 4జీ స్పెసిఫికేషన్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లాంచింగ్‌కు ముందే లీకైన రియల్‌మీ సీ61 4జీ స్పెసిఫికేషన్లు

Realme C61 4G Specifications leaked ahead launch
  • ‘రియల్‌మీ సీ61 4జీ’ పేరుతో భారత మార్కెట్లోకి
  • రూ. 10లోపు ధరతో బడ్జెట్ ఫ్రెండ్లీ
  • 4జీ, 6జీ వేరియంట్లు
  • 50 ఎంపీ ప్రధాన కెమెరా
చైనీస్ మొబైల్ మేకర్ రియల్‌మీ నుంచి 4జీ సెగ్మెంట్‌లో మరో ఫోన్ త్వరలోనే భారత్ మార్కెట్‌లోకి రానుంది. ‘రియల్‌మీ సీ61 4జీ’ పేరుతో రానున్న ఈ బడ్జెట్ ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లాంచింగ్‌కు ముందే లీకయ్యాయి. యూనిసోక్ చిప్‌సెట్, 6జీబీ ర్యామ్, మల్టిపుల్ స్టోరేజీ ఆప్షన్లతో ఇది రాబోతున్నట్టు తెలుస్తోంది. 

రియల్‌మీ సీ61 4జీ ధర ఎంతంటే?
రియల్‌మీ సీ61 4జీ ధర గ్లోబల్ మార్కెట్లో రూ. 11,600 వరకు ఉండే అవకాశం ఉంది. భారత్‌లో మాత్రం రూ.10 వేల లోపు ఉండే అవకాశం ఉంది. మనకు మార్బల్ బ్లాక్, సఫారీ గ్రీన్ రంగుల్లో అందుబాటులోకి రానుండగా, గ్లోబల్ వేరియంట్ మాత్రం డార్క్ బ్లాక్, డార్క్ గ్రీన్ రంగుల్లో ఉండే అవకాశం ఉంది. 

రియల్‌మీ సీ61 4జీ స్పెసిఫికేషన్లు 
రియల్‌మీ సీ61 4జీ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్‌లో ‘ఆర్ఎంఎక్స్ 3939’గా దర్శనమిచ్చింది. హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1600 x 720 పిక్సెల్స్‌తో రిజల్యూషన్, యూనిసోక్ స్పీడ్‌ట్రమ్ టీ612 4జీ చిప్‌సెట్,  4జీ, 6జీ ర్యామ్ వేరియంట్లు, 128జీబీ వరకు స్టోరేజీని పెంచుకునే వెసులుబాటు, ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా,  వాటర్ డ్రాప్ ఆకారంలో నాచ్, 5,000 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వంటివి ఉన్నట్టు లీకైన స్పెసిఫికేషన్ల బట్టి తెలుస్తోంది.
Advertisement
Realme C61 4G
Indian Markets
China
Realme
Realme C61 4G Specifications

More Telugu News