వారిని చేర్చుకోవడం ద్వారా, రేవంత్ రెడ్డి బీజేపీకి ద్వారాలు తెరుస్తున్నారు: ధర్మపురి అర్వింద్
- రేవంత్ రెడ్డి ఇచ్చినవన్నీ మోసపూరిత వాగ్ధానాలేనని విమర్శ
- సెటిల్మెంట్లు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని వ్యాఖ్య
- మున్ముందు బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అర్వింద్
మున్ముందు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా పాలన చేస్తోందని విమర్శించారు. ప్రజలు మౌలిక వసతులు, తాగు, సాగునీరు, కరెంట్ కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018 డిసెంబర్ తర్వాత తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని... అంటే అంతకుముందు రుణాల సంగతేమిటని ప్రశ్నించారు.