Robbery: 40 సెకన్లలోనే మేడ్చల్ బంగారు దుకాణంలో దోపిడీ: సైబరాబాద్ సీపీ

Cyberabad CP on Medchal gold theft
షార్ట్స్‌లో చూడండి
మేడ్చల్‌లో ఇటీవల ఓ బంగారు ఆభరణాల దుకాణ యజమానిని కత్తితో పొడిచి పట్టపగలే దోపిడీకి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దొంగలు కేవలం 40 సెకన్లలోనే నగదు, నగలను చోరీ చేశారని సైబరాబాద్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నెల 20న మేడ్చల్‌లోని శ్రీ జగదాంబ జ్యువెల్లర్స్ దుకాణంలోకి బురఖా వేసుకొని ఒకరు... హెల్మెట్ ధరించి మరొక దుండగుడు వచ్చారని తెలిపారు. వారు నలభై సెకన్లలోనే దోపిడీ చేశారన్నారు. మూడుసార్లు రెక్కీ నిర్వహించి దోపిడీకి పాల్పడినట్లు చెప్పారు.

నిందితులు పారిపోవడంతో 200 సీసీ కెమెరాలను పరిశీలించినట్లు చెప్పారు. కిలో మీటరు దూరంలో బైక్ పెట్టి వారు పరారయ్యారని పేర్కొన్నారు. వారు ఓయూ, హబ్సిగూడలో బైక్‌లను దొంగిలించినట్లు చెప్పారు. నిందితులను పట్టుకోవడానికి 16 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. నిందితులను నజీం, సోహైల్‌లుగా గుర్తించినట్లు చెప్పారు. ఇటీవల చాదర్‌ఘాట్‌లో జరిగిన చోరీలోనూ వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామన్నారు.
Go Back to Shorts
Robbery
Hyderabad
Police

More Telugu News