బీహార్‌లో కుప్పకూలిన మరో వంతెన... బ్రిడ్జి కూలుతున్న వీడియో ఇదిగో
- కూలిన గండక్ కాలువ పైవంతెన
- ఈ వారంలో బీహార్‌లో రెండో ఘటన
- ఇటీవల కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన
ఈ వంతెన పైనుంచి ప్రతిరోజు వందలాదిమంది రాకపోకలు సాగిస్తుంటారు. నిర్వహణ లోపం వల్లే వంతెన కూలిపోయిందని... ఇందుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వంతెన దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. ఇప్పుడిది కూలిపోవడంతో గండక్ కాలువ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి.