సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు

సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు

CM Chandrababu Kuppam tour finalised
  • ఎన్నికల్లో గెలిచాక తొలిసారి కుప్పం వెళుతున్న చంద్రబాబు
  • ఈ నెల 25, 26 తేదీల్లో పర్యటన
  • నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్న చంద్రబాబు
సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారైంది. ఈ నెల 25, 26 తేదీల్లో చంద్రబాబు రెండ్రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన కుప్పంలో పర్యటించనుండడం ఇదే ప్రథమం. 

తన పర్యటనలో భాగంగా, నియోజకవర్గంలోని నేతలు, కార్యకర్తలను ఆయన కలవనున్నారు. నియోజకవర్గంలోని మండలాల్లో పర్యటించి టీడీపీ శ్రేణులతో సమావేశాలు నిర్వహించనున్నారు. తనపై నమ్మకం ఉంచి మరొకసారి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలపనున్నారు. 

చంద్రబాబు కుప్పం నియోజకవర్గం నుంచి వరుసగా 8వ సారి విజయం సాధించారు. నాడు చంద్రగిరిలో ఓటమి తర్వాత కుప్పం నియోజకవర్గానికి మారిన చంద్రబాబు 1989 నుంచి ఇక్కడ ఎదురులేని ప్రస్థానం కొనసాగిస్తున్నారు.
Advertisement
Chandrababu
Kuppam
TDP
Andhra Pradesh

More Telugu News