ఇంగ్లీష్ మీడియంపై ఆసక్తి ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదు: ఎన్‌సీఈఆర్టీ చీఫ్
- ఇంగ్లీష్ మీడియం వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్య
- ఇంగ్లీష్ మీడియం వైపు ఆసక్తి అంటే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లేనన్న దినేశ్
- ఇంగ్లీష్‌తో నింపడం అంటే పిల్లలను మూలాలు, సంస్కృతి నుంచి దూరం చేయడమేనని వ్యాఖ్య
కంటెంట్ మొత్తాన్ని ఇంగ్లీష్‌లో నింపడం వల్ల పిల్లలను వారి మూలాలు, సంస్కృతి నుంచి దూరం చేయడమే అవుతుందన్నారు. దీంతో పాటు విజ్ఞానంపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మాతృభాష ఆధారిత బోధన ఉంటేనే మూలాలను సరిగ్గా అర్థం చేసుకోగలమన్నారు. ఇది వివిధ భాషలను నేర్చుకోవడానికి దోహదం చేస్తుందని తెలిపారు. భాష అంటే శక్తిని ఇచ్చేలా ఉండాలి తప్ప కోల్పోయేలా ఉండకూడదన్నారు.