సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గుమ్మిడి సంధ్యారాణి
- సాలూరు నియోజకవర్గం నుంచి గెలిచిన గుమ్మిడి సంధ్యారాణి
- ఏపీ మహిళా, శిశు సంక్షేమం, గిరిజన వ్యవహారాల మంత్రిగా నియామకం
- ఐటీడీఏ, ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి
- అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని స్పష్టీకరణ
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంలను నియమిస్తున్నామని తెలిపారు. గిరిజన పాఠశాల్లో డ్రాప్ అవుట్లను నివారిస్తామని చెప్పారు. ఐటీడీఏ, ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేస్తున్నామని వివరించారు. అంగన్వాడీల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని వెల్లడించారు.