ఏడాది చిన్నారి అపాయంలో పడ్డా పట్టించుకోని తండ్రి! వీడియో ఇదిగో!

Man consoles wife hurt by fireworks at party ignores crying baby
  • ఓ చిన్నారి తొలి పుట్టిన రోజు వేడుకల్లో అపశృతి
  • బాణసంచా నిప్పురవ్వలు బిడ్డవైపు దూసుకురావడంతో బెదిరిన చిన్నారి
  • ఏడుస్తున్న బిడ్డను పట్టించుకోకుండా తన భార్యకు ఏంకాకూడదని తాపత్రయ పడ్డ భర్త
  • నెట్టింట వైరల్ గా మారిన ఘటనపై జనాల విమర్శలు
కన్నబిడ్డలు అపాయంలో ఉంటే తల్లిదండ్రులు తమ ప్రాణాలను అడ్డేసేందుకు సైతం వెనకాడరు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా బిడ్దను నిర్లక్ష్యం చేసి భార్య బాగోగులపైనే దృష్టిపెట్టడం నెట్టింట చర్చనీయాంశంగా మారింది. 

నెట్టింట వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ యువ దంపతులు తమ బిడ్ద తొలి పుట్టిన రోజు వేడుకలను ఆర్భాటంగా నిర్వహించారు. ఈ క్రమంలో రంగురంగుల పూలతో అలంకరించిన ట్రాలీలో చిన్నారిని కూర్చోపెట్టి ఆ పక్కనే బాణసంచా పేల్చారు. అయితే, ప్రమాదవశాత్తూ కొన్ని నిప్పురవ్వలు చిన్నారితో పాటు బాలిక తల్లివైపు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో బాలిక భయపడి ఏడుస్తుంటే అక్కడే ఉన్న తండ్రి మాత్రం బిడ్డ బాగోగులు మరిచి పక్కనే ఉన్న తన భార్యపైనే దృష్టిపెట్టాడు. కనీసం బిడ్డను లేవనెత్తేందుకు కూడా ముందుకు రాలేదు. అక్కడే ఉన్న మరో మహిళ బిడ్డను ఎత్తుకుని ఊరడించింది. 

ఈ ఘటన తాలూకు వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో జనాలు పాప తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల్లో ఇలాంటి నిర్లక్ష్యం తామెప్పుడూ చూడలేదని మండిపడుతున్నారు.
Go Back to Shorts
Dad Ignores toddler
Birthday Party
Viral Videos

More Telugu News